Namaste NRI

ఆయ్ వసూళ్లతో విరాళం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ధాటికి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఇళ్లు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కాగా ఏపీ వరద బాధితుల సహాయార్థం ఆయ్‌ నిర్మాత ముందుకొచ్చారు.వరదల్లో నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించేందుకు తమ వంతుగా సినిమా వసూళ్లలో 25 శాతం విరాళంగా అందించాలని ఆయ్‌ టీం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి వీకెండ్‌ వరకు వచ్చిన మూవీ షేర్స్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నారు. ఆయ్‌ థియేటర్లలోకి వచ్చి 17 రోజులు అవుతుంది.

నిర్మాత తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగ్గ విషయమే అయినప్పటికే 17 రోజులుగా థియేటర్లలో ఉన్న ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చే షేర్లలో 25 శాతం అంటే తక్కువ మొత్తమే వస్తుందని అంచనా. ఆయ్ ఇప్పటివరకు రూ.16.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events