
అగ్ర హీరో ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారంటూ మీడియాలో వార్తలొచ్చాయి. ఆయన పెద్దప్రమాదం బారిన పడ్డారని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. వీటిపై ఎన్టీఆర్ వ్యక్తిగత బృందం స్పందించింది. మీడియాలో ప్రచారం అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమచేతికి చిన్న గాయమైంది. ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత ఆయన దేవర షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అభిమానులు నమ్మొద్దని కోరుతున్నాం అని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.
