ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురైయినట్లు తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందని. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద శనివారం అర్ధ రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. నేను క్షేమంగా ఉన్నానని మంగ్లీ పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రింద జరిగింది. అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. అంటూ మంగ్లీ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)