పాకిస్థాన్‌కు 45 కోట్ల డాలర్ల విలువైన సాయాన్ని సైనిక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఎఫ్-16 రకం యుద్ధ విమానాల విడిభాగాల రూపంలో సరఫరా చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి లూయిడ్ ఆస్టిన్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఫోన్ సంభాషణ సౌహార్దంగా, ఉత్పాదకంగా సాగిందనీ, రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకునే చర్యలపై మాట్లాడుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. విమాన వాహక నౌక విశ్రాంత్ సేవలు అందుబాటులోకి వచ్చినందుకు మన దేశాన్ని అమెరికా అభినందించిందని తెలిపారు. భారత్, సైన్యం ఆధునికీకరణకు, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)