సిధ్ స్వరూప్, కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లభి ప్రధాన తారాగణంగా సూర్య నారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దోస్తాన్. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య నారాయణ అక్కమ్మ మాట్లాడుతూ సిధ్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఎమోషన్ ప్రేమ, స్నేహం, ప్రధానంగా ఈ మూడు అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది అన్నారు. ఇంతకుముందు హరీస్ రావు విడుదల చేసిన సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. డిసెంబర్ 2న ప్రేకుల ముందుకు తీసుకొస్తున్నాం. దోస్తాన్ సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫుర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.