Namaste NRI

డా. తోటకూర ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు,  అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత, తెలుగు భాష, సంస్కృతి, సాహితీ సంప్రదాయాల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం నిరంతరం శ్రమిస్తున్న కృషీవలుడు డా. తోటకూర ప్రసాద్ అందుకున్నారు. సెప్టెంబర్ 9న పిఠాపురంలో వేలాదిమంది సభ్యుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో డా. ప్రసాద్‌కు రూ.50 వేల నగదుతో పాటు ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఉమర్ ఆలీషా సాహితీ సమితి (భీమవరం) వెల్లడించింది.

ఈ కార్యక్రమంలో డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఎందరో సుప్రసిద్ధ సాహితీవేత్తలు, పండితులు, అవధానులు, భాషాసేవకులు ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారని, అంతటి చరిత్ర కలిగిన పరంపరలో తాను ఈ పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రవాసాంధ్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ పురస్కారానికి తనను ఎంపికచేసిన సాహితీ సమితి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 550 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల్గిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక, సాహిత్య, సేవాకృషి చేస్తున్న విశిష్ట వ్యక్తి ప్రస్తుత నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్నారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సాహితీసమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. కె. పద్మరాజు, జేఎన్టీయూ విశ్రాంత ఆచార్యులు డా. ఈశ్వర్ ప్రసాద్, డా. ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ శ్రీమతి వి. మాధవి,  వడ్డి విజయలక్ష్మి, త్సవటపల్లి సాయి వెంకన్నబాబు,   పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డా. పింగళి ఆనందకుమార్, ఎన్.టి.వి. ప్రసాద వర్మ, ఏవీవీ సత్యనారాయణ, తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, పద్యకవి వామరాజు సత్యమూర్తి, సాహితీ విమర్శకుడు రోచిష్మాన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress