సైఫొద్దీన్ దావుదీ బోరా కమ్యూనిటీకి అధిపతి, భారత పౌరుడైన డాక్టర్ సైద్నా ముఫదల్ సైఫొద్దీన్‌కు పాకిస్థాన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ ఏ పాకిస్థాన్ ను అందజేసింది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఈ పురస్కారాన్ని అందజేశారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం అందించింది. యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో స్కూల్ ఆఫ్ లా ఏర్పాటుకు ఆయన ఎంతో కృషిచేశారు. భారత్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి ఆయన చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)