అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్.వాసుదేవరెడ్డి ఆర్‌నలిపిరెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఎన్‌ఆర్‌ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, అలాగే చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవ రెడ్డి కృషి చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని, దీని సాధనలో ప్రవాస భారతీయ వైద్యులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తానని ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి తెలిపారు.