ప్రశాంత్‌కృష్ణ, అనీషాధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డ్రీమ్ క్యాచర్ . దీప్ కాకుల దర్శకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇన్‌సెప్షన్ లాంటి హాలీవుడ్ సినిమాలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయని, కలల నేపథ్యంలో ఈ సినిమా తీశానని, ఎలాంటి పాటలు, ఫైట్స్ లేకుండా గంటన్నర నిడివితో సాగుతుందని తెలిపారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని హీరో ప్రశాంత్‌కృష్ణ పేర్కొన్నారు. జనవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రణీత్ గౌతమ్ నందా, సంగీతం: రోహన్‌శెట్టి, సంభాషణలు: గుహన్ జాస్తి, నిర్మాణ సంస్థ: సీయోల్ మోహన్ పిక్చర్స్, రచన-దర్శకత్వం: సందీప్ కాకుల.