వరల్డ్‌లోనే పర్యాటకులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా పేరొందిన దుబాయ్ కూడా టూరిస్టులకు ఇచ్చే వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ లో ఉండే ప్రవాసులు తమ కుటుంబ సభ్యులను విజిట్ వీసాపై లేదా టూరిస్ట్ వీసా మీద దుబాయికి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారు కదా. అలాంటి వారికి తాజాగా దుబాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 200 దిర్హమ్స్‌తో (రూ.4,500) ప్రవాసులు ఏ రకమైనా వీసానైనా 60 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కల్పించింది. అంటే మీరు ఇంతకుముందు పొందిన వీసా వాలిడిటీతో పాటు మరో రూ. 4,500 చెల్లిస్తే అదనంగా రెండు నెలలు దుబాయ్‌లో ఉండొచ్చు అన్నమాట.