Namaste NRI

దుబాయ్ సంచలన నిర్ణయం.. ఇకపై పర్యాటకులకు

ఇస్లామిక్ నిబంధనల కారణంగా అంతర్జాతీయంగా, ఆర్ధికంగా తాము నష్టపోతున్న విషయాన్ని గ్రహించిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్  క్రమేణా కొన్ని నియమాలను సడలిస్తుంది. సహాజీవనానికి అనుమతి, హిందువు, క్రైస్తవ సివిల్ చట్టాలను గుర్తించిన యూఏఈ  ఇప్పుడు తాజాగా మద్యం విక్రయాలపై నిబంధనలను సడలించింది.​ దుబాయి చట్టాల  ప్రకారం కేవలం రెండు ఏజన్సీలు మాత్రమే మద్యాన్ని అనుమతించబడ్డ నిర్దేశీత ప్రదేశాలలో విక్రయించాలి మరియు సేవించాలి. 21 సంవత్సరాల పైబడి వీసా కల్గి ఉన్న వారు అది కూడా ముస్లిమేతరులు మాత్రమే మద్యం సేవించడానికి, దుకాణం నుండి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా లైసెన్సు పొందాలి. దీనికి కొంత ఫీజు చెల్లించాలి. ఇక ముస్లింలు మద్యం త్రాగడం పూర్తి నిషేధం. అలాగే అన్ని రకాల మద్యంపై 30 శాతం పన్ను ఉంటుంది.

తాజాగా లైసెన్సు ఫీజును రద్దు చేయడంతో పాటు మద్యంపై పన్నును దుబాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గి పర్యాటకలకు ఊరట కల్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది.  ఇక గతంలో ఉన్న విధంగా మద్యం లైసెన్సు కేవలం ముస్లిమేతరులకు మాత్రమేనా? లేక ఇస్లాంను అచరించే వారికి కూడా ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయలేదు. దుబాయిలో ధరలు ఎక్కువ కావడంతో దుబాయి నుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు సమీపంలో ఉన్న ఉమ్మాల్ ఖ్వాన్‌కు వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారట. 4 దిర్హాంలు (రూ.90) ఉన్న బీరు సీసా దుబాయిలో క్యాబ్రే బార్లలో 50 దిర్హమ్స్ (రూ.1,126), మాములు షాపులలో 25 దిర్హాంలకు (రూ.563) విక్రయిస్తారు. ధర ఎక్కువ అయినా కూడా ప్రతి వారంతరానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ, అధికార, సినీ ప్రముఖులు దుబాయికు డ్రింక్ పార్టీలకు వస్తుంటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events