అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏఐఏ, బాలీ 92.3 సంయుక్తంగా కాలిఫోర్నియాలోని ప్లెసెంటన్లో ఉన్న అలమెడా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ ఫ్లాగ్ షిప్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించడం ఆనవాయి తీ. ఉత్తర అమెరికాలోని 45కు పైగా భారతీయ సంస్థలు ఈ ప్రత్యేకమైన, అతి పెద్ద గ్రాండ్ దివాళీ ఈవెంట్ నిర్వహణకు మద్దతుగా నిలిచాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న ఈ ఈవెంట్ ఆహూతులను ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు 20 వేల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.
25 అడుగుల ఎత్తైన అయోధ్య రామాలయం నమూనాతో పాటు రావణ దహనం, టపాసులు కాల్చే వేడుకను చూసేందుకు వారంతా తండోపతండాలుగా తరలివచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భిన్నత్వం లో ఏకత్వం, వైవిధ్యం వంటి వాటిపై ఈ కార్యక్రమాన్ని రూపొందించారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సీపీఏ (బాణాసంచా), డాక్టర్ ప్రకాష్ అద్వానీ (రావన్ దహన్), ఇతర స్పాన్సర్లుగా రిలేటర్ నాగరాజ్ అన్నయ్య, లుర్నిగో(ఎడ్యుకేషనల్ పార్ట్నర్), ట్రావెల్ పోడ్, జీ5 (ఎక్స్ క్లూజివ్ స్ట్రీమింగ్ పార్ట్ నర్), ఆన్‌షోర్ కరే, కార్డియా (అలివ్కోర్ ఇంక్), తాజ్ మహల్ రెస్టారెంట్, ఇన్‌స్టా సర్వీస్, ఆజాద్ ఫైనాన్షియల్స్, ఫ్రెష్ మీట్ ఫ్యాక్టరీ, రియల్ ఎం రినోవేషన్స్, తనిష్క్ యూఎస్ఏ, భాను మాంగోస్ & థియస్ జ్యువెలర్స్ & దేశీ ఫేవర్స్ మీడియా పార్ట్నర్గా నమస్తే ఆంధ్ర వ్యవహరించింది.
ఆలమీడా కౌంటీ సూపర్వైజర్ డేవిడ్ హౌబెర్ట్ (కో-హోస్ట్), భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, సిటీ ఆఫ్ ప్లెసెంటన్ మేయర్ కార్లా బ్రౌన్, అసెంబ్లీ సభ్యులు లిజ్ ఓర్టెగా, అలెక్స్ లీ, ఆలమీడా కౌంటీ సూపర్వైజర్లు ఎలిసా మార్క్వెజ్, లీనా టామ్, మేయర్ కార్మెన్ మోంటానో (మిల్పిటాస్), అసెంబ్లీ సభ్యులు మియా బోంటా, అలెక్స్ లీ, ఓర్టెగా, లివ్ మోర్ మేయర్ జాన్ మర్చండ్, సిటీ ఆఫ్ ఫెర్మోంట్ మేయర్ లిల్లీ మీయ్, సిటీ ఆఫ్ డబ్లిన్ మేయర్ మైఖేల్ మెక్ కోరిస్టన్, కౌన్సిల్ సభ్యులు రాజ్ సల్వాన్, శ్రీదర్ వెరోస్, కెప్టెన్ రాయ్ గామెజ్ (ప్లెసెంటన్ పోలీస్ డిపార్ట్ మెంట్) తదితరులు అక్కడకు వచ్చిన వారికి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కాంగ్రెస్ మ్యాన్ నుంచి డిస్ట్రిక్ట్ స్టాఫ్ అయిన రో ఖన్నా, ఎరిక్ స్వాల్ వెల్, రెబెక్కా బ్యూర్ కహాన్లు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
స్థానిక రెస్టారెంట్లు గ్రేట్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి వండి వార్చిన రుచికరమైన, భిన్నమైన వంటకాలను ఆహూతులు ఆస్వాదించారు. తమకు నిరంతరం మద్దతు తెలుపుతున్న స్పాన్సర్లందరికీ ఏఐఏ బృందం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో వాలంటీర్లతోపాటు మిడిల్, హైస్కూల్ విద్యార్థులు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపింది.