Namaste NRI

దసరా మూవీ  సక్సెస్‌ ఈవెంట్‌

నాని హీరోగా నటించిన సినిమా  దసరా.  నాని , కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ( మార్చి 30 న) పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై భారీ విజయం సాధించింది. నాని కెరియర్ లోనే బెస్ట్ గా మూవీ నమోదు కావడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ నమోదు చేస్తుంది. ఈ తరుణంలో మేకర్స్ కరీంనగర్‌ పట్టణంలో దసరా సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ జరిగింది. హీరో నానితో పాటు చిత్ర యూనిట్‌ హాజరైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు, కళోత్సవాలకు, విజయోత్సవాలకు వేదికగా కరీంనగర్ మారిందన్నారు. మానేరు నీళ్లలోనే ఒక పవర్ ఉందని, తెలంగాణ సంస్కృతిలో ఒక గొప్పదనం ఉందన్నారు. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు బలగంతో, పెద్దపల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల దసరా తో కరీంనగర్ సత్తా చాటారన్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నాయన్నారు. కాసర్ల శ్యామ్ గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంస్కృతికి ఎలుగెత్తి చాటుతున్నారన్నారు. నాని ఎక్కడ పుట్టినా దసరా సినిమా తర్వాత మా తెలంగాణ బిడ్డయ్యాడని, గతంలో తెలంగాణ భాష గుండాలకు పెట్టారని, నేడు తెలంగాణ భాష లేకపోతే సినిమాలే లేని పరిస్థితికి వచ్చిందన్నారు. తెలంగాణ భాషతో సినిమా తీస్తే సూపర్ హిట్ అనేది సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడం శుభపరిణామం అన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న పైడి జయరాజ్, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన సినారె ఇలా నాటితరం నుంచి నేటితరం వరకూ సినిమాకు ఆయువుపట్టుగా కరీంనగర్ నిలుస్తూనే ఉందన్నారు. దసరా యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ కరీంనగర్ ఎనర్జీ అద్భుతంగా ఉందన్నారు. ఈవెంట్ సక్సెస్‌కు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌లో అద్భుతమైన అభివృద్ధితో పాటు ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుందని, త్వరలోనే ఇక్కడ షూటింగ్ కోసం ప్లాన్‌ చేస్తానన్నారు.

 ఇక ఈ మూవీ నాల్గు రోజుల కలెక్షన్స్ చూస్తే.. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో కలిపి తొలి రోజు 23.2 కోట్లు, రెండో రోజు 9.75 కోట్లు, మూడో రోజు 12.1 కోట్లు, నాలుగో రోజు 12.6 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో సుమారు ఈ చిత్రం 57 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events