నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చిత్రీకరణ జరుగుతున్నది. నాయకానాయికలు నాని, కార్తీ సురేష్‌లపై భారీ స్థాయిలో పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రేమిత్ర్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పాటను దాదాపు 500 మంది డ్యాన్సర్స్‌తో తెరకెక్కిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో జరిగే కథ ఇది. నాని పక్కా మాస్ పాత్రలో కనిపిస్తారు. యాక్షన్ ప్రాధాన్యంతో ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ప్రస్తుతం భారీ స్థాయిలో పాటను చిత్రీకరిస్తున్నాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలంగాణ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణ్, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.