రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర ముఖ్య తారాగణం తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. ఇందులో రవితేజతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. విభిన్న కథాంశంతో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. రవితేజ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యాక్షన్ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, సంభాషణలు: మణిబాబు కరణం, స్క్రీన్‌ప్లే: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం, రచన-దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.
