నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. మూడు పార్టీలకు ఈ విజయం తప్పనిసరి కావడంతో బాగా ఫోకస్ పెట్టాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ సైతం మునుగోడుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారుల బదిలీలు.. వామపక్షాలను తమవైపు తిప్పుకోవడంలో ముందుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడులో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరుఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. రోజుకో సీనియర్ నేత మునుగోడుకు వెళ్లి ఆమె తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.














