దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు ముమ్మరంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ గురించి కీలక ఆదేశాలు జారీ చేస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష న్ ప్రకారం ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 రాత్రి 7:30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్‌లను ప్రచురించడం చేయోద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా వివిధ దశల్లో ఓటింగ్ జరగనుంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల తోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయంతో ముగిసే 48 గంటల వ్యవధిలో ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణ లేదా ఏదైనా ఇతర ఎన్నికల సర్వే నిర్వహించాలని గురువారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రా ల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. అలాగే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పోలింగ్ ముగిసే 48 గంటల వ్యవధిలో ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన ఫలితాలు, అభిప్రాయాల వెల్లడి వంటివి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రదర్శించడాన్ని నిషేధించినట్టు తెలిపింది.