అమెరికాకు చెందిన కెబేకేత్ ఎడ్వార్డ్ స్నైడర్ తాజాగా ప్రతిష్ఠాత్మక గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే అత్యంత ఎత్తు నుంచి దూకి కాదు, కిందకు దూకుతూ అత్యధికసార్లు గింగిరాలు తిరిగి ఈజిప్ట్‌లోని ప్రఖ్యాత గాజా పిరమిడ్ల వద్ద ఈ గత నెల 1వ తేదీన ఈ పీట్ చేశాడు. 13,500 ఫీట్ల ఎత్తునుంచి కెబే ఈ సాహసం చేశాడు. విమానంలో నుంచి కిందకు దూకి భూమికి చేరుకునే క్రమంలో అతడు ఏకంగా 160 సార్లు తిరిగి గతంలో ఉన్న రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ డైవింగ్‌కు సంబంధించిన వీడియోలను అతడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులకు పంపించాడు. ఆ వీడియోలను ధ్రువీకరించిన అధికారులు కెబే ఫీట్‌కు తాజాగా గిన్నిస్ రికార్డుల్లో స్థానం కల్పించారు.
ఈ ఫీట్ సహా గిన్నిస్ రికార్డు పట్ల కెబేకేత్ హర్షం వ్యక్తం చేశాడు. పిరమిడ్ల పైన సర్ఫింగ్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరమని, దీని వెనుక ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు దాదాపు 250 మందికి స్కైడైవింగ్‌లో మెళుకువలు నేర్పినట్లు తెలిపాడు.