రాజమౌళీ ప్రస్తుతం మహేశ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ చకచకా సాగుతు న్నది. అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీగా ఈ చిత్రాన్ని రాజమౌళీ తెరకెక్కిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారతీయ సినిమా చూడని కొత్త ప్రపంచాన్ని రాజమౌళీ ఆవిష్కరించబోతున్నారని ఇటీవలే విజయేంద్రప్రసాద్ మీడియాతో చెప్పారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ దగ్గర్నుంచి, పాత్రధారుల గెటప్పుల వరకూ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా రాజమౌళీ చూసుకుంటున్నారని సమాచారం.
ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని కొత్త లుక్‌లో ఇందులో మహేశ్ కనిపించనున్నారట. ఈ లుక్‌కి సంబం ధించిన ఎనిమిది స్కెచ్లను రాజమౌళీ సిద్ధం చేశారట. ఆ లుక్స్‌తో త్వరలో మహేశ్‌కి టెస్ట్ ఫొటో షూట్ చేయ నున్నారని తెలిసింది. అందులో ఒక లుక్‌ని ఖరారు చేస్తారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలను రాజమౌళీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటిస్తుంటారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ని ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.