Namaste NRI

రవితేజ మాస్ ఎనర్జీతో.. ఏక్ దమ్ ఏక్ దమ్

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ చిత్రంలో నూపూర్‌ ససన్‌, గాయత్రి భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ నేపథ్యంలో చిత్ర మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేశారు. ఏక్‌దమ్‌ ఏక్‌ దమ్‌ అనే గీతాన్ని విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ స్వరపరచిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యాన్నందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. యూత్‌ని, మాస్‌ను మెప్పించే గీతమిదని, హుషారైన స్టెప్పులతో అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.మది, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ. అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events