Namaste NRI

తెలంగాణలో రూ.24 వేల కోట్లతో ఎలెస్ట్ పెట్టుబడులు

భారత్‌లో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తెలంగాణ నిలుస్తుంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల తయారీకి  ఉపయోగించే అత్యాధునిక అమోలెడ్‌ డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగానికి చెందిన దిగ్గజం కంపెనీ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) వెల్లడిరచింది. రాష్ట్రంలో 24 వేల కోట్లతో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఫార్చ్యున్‌ `500 కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ దేశంలోనే తొలిసారి తన డిస్‌ప్లే ఫ్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ కంపెనీ బెంగళూరులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. దీనిపై రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు దీంతో దేశీయ డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలెస్ట్‌ చరిత్రకెక్కనున్నది.

                హైదరాబాద్‌లో ఈ కంపెనీ నెలకొల్పే యూనిట్‌ ద్వారా దాదాపు 3 వేల మంది సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులకు ప్రత్యక్షంగా, అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ మాన్యుఫ్యాక్యరింగ్‌ రంగానికి చెందిన అనుబంధ సంస్థలు వేల మంది సరఫరాదారులకు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బెంగళూరు కేంద్రంగా కార్యకలపాలను కొనసాగిస్తున్న ఎలెస్ట్‌ కంపెనీ అమోలెడ్‌ డిస్‌ప్లే, లిథియం అయాన్‌ సెల్స్‌, బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైంది. ప్రపంచంలోని అత్యుత్తమ డిస్‌ప్లే ఫ్యాబ్‌ కంపెనీలకు దీటుగా ఎలెస్ట్‌ హైదరాబాద్‌ యూనిట్‌లో 6వ తరం అమోలెడ్‌ డిస్‌ప్లేను తయారు చేయనున్నది. మొదట నగర శివారులోని దుండిగల్‌ 50 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండగా, ఆ తర్వాత మరో 300 ఎకరాల్లో అత్యంత ఆధునాత తయారీ  ఫ్యాక్టరీని నిర్మించనుంది.

                డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో ఎలెస్ట్‌ నుంచి భారీ పెట్టుబడి రావడం తెలంగాణతో పాటు యావత్‌ దేశానికే గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పెట్టుబడితో భారత్‌ అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో జపాన్‌, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన నిలుస్తుందని, ఇప్పటి వరకు జపాన్‌, కొరియా తైవాన్‌కు మాత్రమే సాధ్యమైన అడ్వాన్స్‌డ్‌ హైటెక్‌ ఉత్పత్తులు ఇకపై తెలంగాణలోనూ తయారవుతాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events