Skip to main content

Namaste NRI

ఏపీ పల్లెల్లో ఎన్నికల వేడి..!

ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో, గ్రామాల్లో అభ్యర్థుల హడావిడి, వ్యూహ ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. కేవలం 12 రోజుల్లోనే నామినేషన్ల నుంచి ఫలితాల వరకు ప్రక్రియ మొత్తం ముగియనుండటంతో పల్లె పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఈనెల 17వ తేదీని నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. 18వ తేదీన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. ఒకవేళ ఎవరి నామినేషన్ అయినా తిరస్కరణకు గురైతే, 19న అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. వీటిని 20వ తేదీన పరిష్కరిస్తారు. బరిలో నిలిచేది ఎవరో ఈనెల 21న తేలిపోనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ వెంటనే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రోజు ఈనెల 26. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ ముగిసిన గంట వ్యవధిలోనే, అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించి, విజేతలను ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడిన వెంటనే అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. ఎక్కడైనా అనివార్య కారణాల వల్ల పోలింగ్ నిలిచిపోతే, ఈనెల 27న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events