ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఎలన్ మాస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ బోర్డులో మస్క్ చేరడం లేదని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ అగర్వాల్ తెలిపారు. బోర్డులో సభ్యుడిగా ఉండటం ఎలన్ మస్క్‌కు అసక్తి లేదని అన్నారు. ఆయన సలహాలు, సూచనలు మాత్రం బోర్డు పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎలన్‌ను బోర్డులో చేర్చుకోవడం విషయమై ఆయనతోనే భేటీ అయినట్టు తెలిపారు. ఈ సమావేశంలో బోర్డులో చేరేందుకు ఇష్టం లేదన్న విషయాన్ని ఎలన్ మాస్క్ ప్రకటించారన్నారు. కంపెనీ వాటాదారులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బోర్డులో సభ్యుడిగా అవకాశం ఇచ్చినట్టు అగర్వాల్ తెలిపారు.