Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు… రానున్న ఐదు, పదేళ్లలో

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదు, పదేళ్లలో ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొంటుందని మస్క్‌ హెచ్చరించారు. అణ్వాయుధాలు అగ్రరాజ్యాల మధ్య యుద్ధాన్ని నిరోధిస్తాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని ఓ యూజర్‌ చేసిన వాదనపై మస్క్‌ స్పందిస్తూ రానున్న 5 సంవత్సరాలలో యుద్ధం అనివార్యమని, మహా అయితే 10 సంవత్సరాలని చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను ఆయన వివరించే ప్రయత్నం చేయలేదు.

Social Share Spread Message

Latest News