అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్ర్రం మస్క్‌కు షాక్ ఇచ్చారు. తనకు ట్విట్టర్‌లోకి తిరిగి రావాలని లేదని ట్రంప్ వెల్లడిరచారు. ట్విట్టర్ ఖతాను మళ్లీ ఉపయోగించడానికి తనకు ఎలాంటి కారణం కన్పించడం లేదని పేర్కొన్నారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రుత్ సోషల్ చాలా అద్భుతంగా ఉందని, ట్విట్టర్ కంటే ఎక్కువ ఫీచర్స్ అందులో ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ట్విట్టర్‌లో బాట్, నకిలీ ఖాతాలు వంటి చాలా సమస్యలు ఉన్నయని ట్రంప్ వ్యాఖ్యానంచారు. ట్రుత్ సోషల్‌లో అలాంటి సమ్యలు లేవని స్పష్టం చేశారు. .ట్రుత్ సోషల్‌ను ట్రంప్‌కు చెందిన ఐటీ కంపెనీనే అభివృద్ధి చేసింది.
