ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యధికులు వినియోగించే జీమెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనున్నదన్న వదంతుల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. జీమెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు. ఎక్స్ మెయిల్ ప్రారంభం తేదీ ఎప్పుడంటూ ఎక్స్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ టీమ్‌లోని సీనియర్ సభ్యుడు నాథన్ మెకగ్రాడి ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మస్క్ త్వరలోనే ఎక్స్ మెయిల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.