
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద పెరిగింది. 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్లు పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన విజయంతో మస్క్ షేర్లు పుంజుకున్నాయి. యూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరిగాయి. కంపెనీ స్టాక్స్ శుకవారం 3.8శాతం లాభంతో 352.56 డాలర్ల వద్ద ముగిసింది. గత మూడేళ్లలో ఇంత స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. స్టాక్స్ పెరుగుదల నేపథ్యంలో మస్క్ సంపద 7 బిలియన్లు పెరుగుదల నమోదైంది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
