ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. రాకెట్ వేగంతో ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచిన మస్క్ అంతే వేగంగా తన సంపదను కోల్పోతున్నారు. 2021 నవంబరులో మస్క్ ఆస్తి 320 బిలియన్ డాలర్లు ఉండగా 2023 జనవరి నాటికి ఆయన సంపద 137 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2021 నుంచి దాదాపుగా ఆయన 182 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ప్రపంచంలో ఎక్కువ వ్యక్తిగత సంపదను కల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ విలువ పడిపోవడమే ఆయన భారీ నష్టాలకు కారణం. ట్విట్టర్ కొన్నప్పటి నుంచి ఆయన 23 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్‌ను అమ్మేశారు.