అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేరు ప్రముఖంగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. అందుకు కారణంగా ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి మద్దతు ఇవ్వడమే. ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పై ఎలాన్ మస్క్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారంటూ మస్క్ జోష్యం చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ నేపథ్యంలో ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో మస్క్‌ను కోరాడు. దీనికి ఈ అమెరికన్ టైకూన్ స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడు అంటూ బదులిచ్చారు. మస్క్ వ్యాఖ్యలతో కెనడాలో లిబరల్ పార్టీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిన్ ట్రూడో ఓడిపోవడానికి భారత్‌తో విబేధాలు పెట్టుకోవడం కూడా ఓ కారణంగా పేర్కొంటున్నారు.