Namaste NRI

ఎలాన్‌ మస్క్ యూటర్న్‌.. పార్టీ ప్రయత్నాలకు బ్రేక్‌!

 టెస్లా కంపెనీ అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ తన రాజకీయ ప్రణాళికల విషయంలో అనూహ్యంగా వెనక్కి తగ్గాడు. అమెరికాలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తాను ఏర్పాటు చేయాలనుకున్న అమెరికా పార్టీ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. పార్టీ ఏర్పాటు చేస్తే రిపబ్లికన్ పార్టీ  లోని ప్రభావవంతమైన నేతలతో, ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ తో తన సంబంధాలు దెబ్బతింటాయని మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మాగా   రాజకీయ ఉద్యమానికి భవిష్యత్ వారసుడిగా భావిస్తున్న జేడీ వాన్స్‌తో మస్క్ గత కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  తాను కొత్త పార్టీని ప్రారంభిస్తే అది వాన్స్‌తో తనకున్న సత్సంబంధాలను దెబ్బతీస్తుందని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2028 అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా తన భారీ సంపదలో కొంత భాగాన్ని వెచ్చించేందుకు కూడా మస్క్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News