Namaste NRI

ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభలో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జులై 2న జరిగే ఆటా మహాసభల్లో కవిత చేతుల మీదుగా తెలంగాణ పెవిలియన్‌ ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం జరిగే ప్రధాన సమావేశంలో కవిత అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events