ఉత్తర కొరియా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవిం చాయి. ఈ వరదలకు వేల మంది నిరాశ్రయులయ్యారు. చైనా సరిహద్దుల్లోని సినాయిజు, ఉయిజు పట్టణాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. ఉయిజు కౌంటీలోని సుమారు 4 వేల ఇళ్లు వరదనీటిలో మునిగిపోయినట్లు తెలిసింది. దాదాపు 3 వేల హెక్టార్లలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ వదర ప్రవాహానికి కొట్టుకుపోయి. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నేరుగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. పడవ సాయంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి అంచనా వేసినట్లు పేర్కొంది. మరోవైపు వరదల నేపథ్యం లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.