నోయల్ సీన్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధన్‌రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఈఎంఐ, ఈ అమ్మాయి. ఈ చిత్రాన్ని బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై డి.రమేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. దొంతు రమేష్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నోయల్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. అమ్మాయిలు తమ జీవితాల్లో వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే సమస్యల నేపథ్యంతో సినిమా సాగుతుంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నా అన్నారు.
ఈ కార్యక్రమానికి దర్శకులు నవీన్ మేడారం, అజయ్ సామ్రాట్, గోపి గణేష్, నిర్మాత బుర్రా ప్రశాంత్ గౌడ్, హీరో, నిమ్మల శ్రీరామ్, నటి సంగీత, నటి సంధ్య జనక్, జర్నలిస్ట్ ప్రభు, నిర్మాత కీర్తి లత గౌడ్ , నటులు దిల్ రమేష్, సునామి సుధాకర్, గంగాధర్, నవీన్, క్రిష్, దర్శకుడు తండ్రి దొంతు బుచ్చియ్య, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ రాజీవ్,మోడల్ ఉదయ్ శ్రీ, బింబిసార చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి, తదితరులు హాజరయ్యారు. ఈ నెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మోహన్ చంద్, సంగీతం : రవిశంకర్.