Skip to main content

Namaste NRI

ఎంపురాన్ ఫస్ట్ లుక్ రిలీజ్..యాక్షన్ మోడ్ లో మోహన్‌లాల్‌

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం  ఎల్‌2 ఎంపురాన్‌.  ఈ చిత్రానికి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సమర్పణలో సుభాస్కరన్‌, ఆంటోని పెరుంబవూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి భాగం బ్లాక్‌బస్టర్‌ కావడంతో మలిభాగంపై అంచనాలు భారీగా ఉన్నాయని, ఖురేషి అబ్రహమ్‌గా ఇటీవల విడుదల చేసిన మోహన్‌లాల్‌ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. మోహన్‌లాల్‌ ఇందులో అత్యంత శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని, ఆయనతోపాటు కొందరు సౌత్‌ స్టార్లు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని మేకర్స్‌ తెలిపారు. జయేద్‌ మసూద్‌గా పృథ్వీరాజ్‌ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో టివినో థామస్‌, మంజు వారియర్‌, సానియా అయ్యప్పన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌ వాసుదేవ్‌, సంగీతం: దీపక్‌దేవ్‌, నిర్మాణం: ఆశీర్వాద్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News