భరత్, విషికా లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఏందిరా ఈ పంచాయితీ. గంగాధర.టీ దర్శకుడు. ప్రదీప్‌కుమార్ నిర్మాత. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టైటిల్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే ఊరి వాతావరణం .. అందులో ఉండే గొడవలు చూపించనున్నట్టు అనిపిస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు వంటివి టైటిల్ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అంటే ఒక ఊర్లో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ సహజత్వానికి దగ్గరగా వుండే కథతో, పాత్రలతో రూపొందుతున్న రా అండ్ రస్టిక్ ఎంటర్‌టైనర్ ఇది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలున్నాయి అన్నారు. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, తేజ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్ (పెద్దపల్లి రోహిత్). ఎడిటర్‌గా జేపీ వ్యవహరిస్తున్నారు. వెంకట్ – ప్రియాంక ఈ చిత్రానికి మాటలు అందించారు.