Skip to main content

Namaste NRI

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్.. తిప్పుకుంటన్నవ్ రిలీజ్

హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. తొలి పాట విడుదలైంది. తిప్పుకుంటన్నవ్‌ అంటూ సాగే ఈ పాటను అగ్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటకు విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచగా, రాము రాథోడ్‌, అదితి భావరాజు ఆలపించారు. వెంకటేష్‌ కాపు కొరియోగ్రఫీ అందించారు. శ్రీదేవి, హర్ష్‌ రోషన్‌పై ఆయన డిజైన్‌ చేసిన మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. మార్చి 13న విడుదల కానున్నది.ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, సమర్పణ: మ్యాంగో మాస్‌ మీడియా, నిర్మాణం: కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌.

Social Share Spread Message

Latest News