బాలీవుడ్ స్టార్ హీరో విక్కీకౌశల్ కథానాయకుడిగా, త్రిప్తి డిమ్రీ కథానాయికగా రూపొందిన సినిమా బ్యాడ్‌న్యూస్. ఈ సందర్భంగా విరివిగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు విక్కీకౌశల్. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా ప్రెగ్నెంట్ అనే వార్తపై ఆయన స్పందిస్తూ నిజంగా అలాంటి గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే, సంతోషంగా మీ అందరితో పంచుకోకుండా ఉంటామా? ఆ వార్తల్లో నిజం లేదు.

ప్రస్తుతానికి బ్యాడ్‌న్యూస్ ఎంజాయ్ చేయండి. సమయం వచ్చినప్పుడు ఆ గుడ్‌న్యూస్ ఎంజాయ్ చేద్దురుగానీ అంటూ నవ్వుతూ చెప్పారు విక్కీ కౌశల్. ఈ సినిమాలోని తౌబా తౌబా పాట విడుదలై మంచి ఆదరణ పొందుతు న్నది. ఈ పాట గురించి మాట్లాడుతూ నాకు డ్యాన్స్ రాదు. కానీ మా యూనిట్ నాకు డ్యాన్స్ నేర్పించారు. ఈ పాటకోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు శ్రమకు తగ్గ ఫలితం ఇస్తారనుకుంటున్నా అని అన్నారు. ఈ నెల 19న విడుదల కానుంది.
