సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎర్రచీర- ది బిగినింగ్. స్వీయ దర్శకనిర్మాణంలో సుమన్‌బాబు తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మదర్‌సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిదని, మూడొందల థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకనిర్మాత, నటుడు సుమన్‌బాబు తెలిపారు.
సెంటిమెంట్‌తో కూడిన హారర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. శ్రీరామ్, కమల్‌కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ పులిగార్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమన్‌బాబు.