ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది. ఇటలీ శాఖ అధ్యక్షుడిగా తానింకి కిశోర్ యాదవ్ ను సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి మాట్లాడుతూ ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. కొత్తగా నియమించబడ్డ ఇటలీ శాఖ అధ్యక్షుడు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.
