
ఎఐఆర్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందనుంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది ఉపశీర్షిక. హర్ష రోషన్, భాను ప్రతాప్, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్ వివరాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. జోసెఫ్ క్లింటన్ ఈ సిరీస్‌కి దర్శకుడు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా మొదలైంది. నిర్మాత ఎస్కేఎన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇదో థ్రిల్లింగ్ వెంచర్ అని, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సిరీస్ అవుతుందని, ఎమోషన్, డ్రామా, వినోదం కలబోతగా ఈ సిరీస్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌కి సందీప్‌రాజ్ సమర్పకుడు కాగా, పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ఈ సిరీస్ రూపొందనుంది.
