
దర్శకుడిగా గుణశేఖర్ త్వరలో మరో వైవిధ్యమైన కథతో రానున్నారు. సినిమా పేరు యుఫోరియా. ఈ యూత్ ఫుల్ సోషల్ డ్రామాను గుణ హ్యాండ్‌మేడ్ ఫిలింస్ పతాకంపై నీలిమ గుణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.















