Namaste NRI

ఎవాల్‌ ట్రైలర్‌ను విడుదల  

సూర్య శ్రీనివాస్‌, శివ బొడ్డు రాజు, జెనిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఎవాల్‌. రివర్స్‌ లవ్‌స్టోరీ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో యోగి వెలగపూడి తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నాం. నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే అంశాలుంటాయి. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్ల ఏం జరిగిందన్నది ఆసక్తిని కలిగిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కథ, స్క్రీన్‌ఫ్లే, లిరిక్స్‌, నిర్మాత, దర్శకత్వం: రామ్‌యోగి వెలగపూడి.

Social Share Spread Message

Latest News