Namaste NRI

ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా..కథపై నమ్మకం ఉంది

పాయల్‌ రాజ్‌పుత్‌ మెయిన్‌ లీడ్‌గా నటించిన చిత్రం రక్షణ.  దర్శకనిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌.  ఈ  సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణదీప్‌ ఠాకోర్‌ విలేకరులతో ముచ్చటించారు. రక్షణ ఓ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. బాధితులకై పోరాటం, వారిని రక్షించే ప్రయత్నం నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి సినిమాకు రక్షణ అనే పేరు పెట్టాం. అసలు ముందు తెలంగాణ పోలీసు వాహనాల పేరైన రక్షక్‌ ని టైటిల్‌గా అనుకున్నాం కుదర్లేదు. చివరకు రక్షణను ఫైనల్‌ చేశాం. ఇది పూర్తి రియలిస్టిక్‌ అప్రోచ్‌ ఉన్న సినిమా అని అన్నారు.

ఇందులో పాయల్‌ అద్భుతంగా నటించింది. అగ్రిమెంట్‌ ప్రకారం ఆమెకు మేం ఇంకా 6 లక్షలు దాకా ఇవ్వాలి. ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమె బ్యాలెన్స్‌ అమౌంట్‌ ఆమెకు ఇచ్చేస్తాం. ఎందుకంటే నాకు ఈ కథపై నమ్మకం ఉంది. మంచి పంపిణీదారులు దొరికారు. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం అని చెప్పారు ప్రణదీప్‌ ఠాకోర్‌. పాయల్‌ రాజ్‌పుత్‌ ఇమేజ్‌ని పూర్తిగా మార్చే సినిమా ఇదని, ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటనను స్పూర్తిగా తీసుకుని ఈ కల్పిత కథ రాశానని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events