విరాన్ ముత్తంశెట్టి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ముఖ్య గమనిక. వేణు మురళీధర్ దర్శకుడు. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య కథానాయిక. ఈ సినిమాలో ఆ కన్నుల చూపుల్లోనా అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ వినూత్న కథాంశంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తు న్నాం. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చి దానిని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి.ఈ పాయింట్ ఆధారంగా నడిచే కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. తమ సంస్థకిది తొలిచిత్రమని, త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం: కిరణ్ వెన్న, దర్శకత్వం: వేణు మురళీధర్.వి.