తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కంపెనీ తమ ఉద్యోగులకు 50 నుంచి 52 నెలల వేతనంతో సమానమైన బోనస్ అందచేసిందని సమాచారం. తమ ఉద్యోగులకు సగటున నాలుగేండ్లకు పైగా వేతనంతో సమానమైన బోనస్ గత ఏడాది చివర్లో ఇచ్చినట్లు తెలుస్తున్నది.తైవాన్ ఆధారిత కాంట్రాక్ట్లతో సంబంధం ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్లు వర్తింపజేస్తున్నది ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి వెల్లడించారు. ప్రతి కంపెనీ ప్రతియేటా సంస్థ సాధించే లాభాలు, వ్యక్తిగతంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్లు ఇస్తూ ఉంటుందని ఎవర్గ్రీన్ తెలిపింది. పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది.