గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఫిబ్రవరి 2న రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సోహెల్ మాట్లాడుతూ నేను షార్ట్ ఫిల్మ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. కంటెంట్ ఉన్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. బూట్‌కట్ బాలరాజు మంచి వినోదాత్మక చిత్రం. మాటకు ఉన్న విలువ, గౌరవం గురించి ఈ చిత్రంలో చెబుతున్నాం అని నిర్మాత వేణుగోపాల్ తెలిపారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బిగ్‌బాస్ ఏడు సీజన్ల కంటెస్టెంట్లతోపాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: బెక్కం వేణుగోపాల్, దర్శకత్వం: శ్రీనివాస్ కోనేటి.