రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పణలో ప్రజెంట్ చేస్తున్న కామెడీ చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. ప్రవీణ పరుచూరి దర్శకత్వం. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ సినిమాలోని పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. విభిన్నమైన, విలక్షణమైన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రవీణ. ఆమె గొప్ప విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి అని రానా కోరారు.

ప్రవీణ మాట్లాడుతూ ఇది నాకు నిర్మాతగా మూడో సినిమా. దర్శకురాలిగా తొలి సినిమా. మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి’ అని కోరారు. నా సినీ గమనాన్నే మార్చే పాత్రను ఈ సినిమాలో చేశాను. మా టీమ్ అంతా చాలా కష్టపడి మీ ముందుకు మంచి సినిమాతో వస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది అని హీరో మనోజ్ చంద్ర చెప్పారు.















