రాజ్‌తరుణ్ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ ఎంటైర్టెనర్ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. గోవిందరాజు సమర్పకుడు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్‌లో భాగంగా సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అగ్ర దర్శకుడు మారుతి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.

హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ రామ్ కడుముల మంచి విజన్ ఉన్న దర్శకుడు. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదు. నటీనటులు, సాంకేతికనిపుణులు అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు. ఈ సినిమా నాకు అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయిరాజేష్, నిర్మాత ఎస్.కె.ఎన్, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు.
