Namaste NRI

ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా : చైతన్యరావు

చైతన్యరావు కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌. హెబ్బాపటేల్‌ కథానాయిక. బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్‌, బాలరాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చైతన్యరావ్‌ మాట్లాడారు.  అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్ర చేయాలనే నా కోరిక  హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ సినిమా ద్వారా తీరింది. ప్రేమికులు, పెళ్లాడబోయేవాళ్లు, పెళ్లాడిన కొత్తజంటలు, ఇరవై ఏళ్లుగా కలిసి బతుకుతున్న దంపతులు ఇలా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఆద్యంతం వినోదభరితంగా దర్శకుడు బాలరాజశేఖరుని ఈ చిత్రాన్ని రూపొందించారు  అన్నారు.

30 వెడ్స్‌ 21 చైతన్యరావ్‌, కుమారి 21ఎఫ్‌ హెబ్బాపటేల్‌, డిఫరెంట్‌ ఇమేజ్‌లు ఉన్న వీరిద్దరూ జంటగా నటించడమే ఈ సినిమా ప్రత్యేకత. కంటెంటే ఈ సినిమా ప్రధాన బలం. చక్కని రొమాంటిక్‌ కామెడీ మూవీ ఇది. దానికి తగ్గట్టే కల్యాణీ మాలిక్‌ అద్భుతమైన పాటలు ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది అని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. నా నటజీవితంలో ఆసక్తికరమైన ప్రయాణం ఈ సినిమా అని హెబ్బాపటేల్‌ చెప్పారు. ఇంకా చిత్ర బృందం మొత్తం మాట్లాడారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events