హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం రోటి కపడా రొమాన్స్. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. యూత్‌కి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని, గుడ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని హక్కులూ అమ్ముడు పోవడం ఆనందంగా ఉందని, 22న సినిమా విడుదల కానున్నదని, 21న ప్రీమియర్లు ప్లాన్ చేశామని, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాత బెక్కెం వేణు గోపాల్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది.